నియోజవర్గ పరిధిలో 8400 నూతన పింఛన్ల పంపిణీ -ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్

మిర్యాలగూడ. జనం సాక్షి అన్ని వర్గాల ప్రజలకు పింఛన్లను ప్రకటించడంలో సీఎం కేసీఆర్ కు సాటి లేరని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ లు అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పేద బలహీన వర్గాలతో పాటు అంగవైకల్యం. వృద్ధాప్యం. ఒంటరి మహిళలు. వితంతువులు. ఇతర అన్ని కేటగిరీలకు సంబంధించి పింఛన్లు జారీచేసి ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ వ్యాప్తంగా 2596 మందికి (వృద్ధాప్య పెన్షన్- 1435 మందికి , దివ్యాంగ పెన్షన్- 188 మందికి , వితంతు పెన్షన్-785 మందికి , నేత కార్మికుల పెన్షన్- 56 మందికి , కల్లు గీత కార్మికుల పెన్షన్- 12 మందికి , ఒంటరి మహిళ పెన్షన్- 126 మందికి). తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసరా పథకం ద్వారా మంజూరు చేసినటువంటి పెన్షన్ కార్డులను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారితో కలిసి లబ్దిదారులకు ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అందజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం .కెసిఆర్ గ ఆసరా పింఛన్ల అర్హత వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారని . వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం నెల నెలా ఆసరా పింఛన్లు అందిస్తోందన్నారు . దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని కొత్తగా మంజూరు అయిన ఆసరా పింఛన్ల ద్వారా నియోజకవర్గంలో మరో 8 వేల 400 మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధిఖారులు, మెప్మా అధికారి బక్కయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు