నిరాశలో కమ్యూనిస్టులు: గండ్ర

హైదరాబాద్‌, జనంసాక్షి: నిరాశ, నిస్ప్రహలతో కమ్యూనిస్టు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అమ్మహస్తం పథకంపై రాఘవులు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతోందన్నారు. ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోతామోనన్న భయంతో సీపీఎం ఆరోపణలు చేస్తోందన్నారు. సర్వేలు చూసుకుని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆయన్ని మరిచిపోయి చాలా రోజులు అయిందన్నారు. ఈ సారి ప్రతిపక్ష హూదా కూడా అనుమానమేనని అన్నారు.