నిరాహారదీక్షలో సైనికుడి తల్లి, భార్య

మధుర : పాకిస్థాన్‌ సైన్యం చేతిలో దారుణంగా హత్యకు గురైన భారత జవాను హేమ్‌రాజ్‌ భార్య, తల్లి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాకిస్థాన్‌ సైన్యం లాన్స్‌ నాయక్‌ హేమ్‌రాజ్‌ సింగ్‌ తలను మొండెం నుంచి వేరు చేసి తీసుకుపోయింది. దాంతో అతని తలను తెచ్చివ్వాలని కోరుతూ అతని భార్య ధర్మవతి, తల్లి మీనాదేవి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయన తల లేదు, చిద్రమైన శరీరం చూసి చనిపోయింది. ఆయనేనని ఎలా నమ్మాలి.. అని ప్రశ్నిస్తోంది ధర్మవతి.