నిరుపేద ఆడపిల్లల సంక్షేమానికి ‘ది పింక్ సర్కిల్’ ఫౌండేషన్ కృషి.

మల్కాజిగిరి,జనంసాక్షి.జూలై22
నిరుపేద ఆడపిల్లల విద్య,వైద్యము కోసం ‘ది పింక్ సర్కిల్’ ఫౌండేషన్ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సుధ ధబ్రాల్ పేర్కొన్నారు.శనివారం సైనికపురి లోని
వివాహ భోజనంబు హోటల్లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షీ టీం కన్సల్టెంట్ రాజేష్, పిఎస్ రావు అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు సుధా దబ్రాల్ మాట్లాడుతూ.సంస్థ లో 150 మహిళలు ఉన్నారనీ,వీరు ప్రతి నెల తమ వంతు విరాళం సంస్థకు అందించడం ద్వారా కొంత నిధిని సమకూర్చుకోవడం జరిగిందన్నారు. అలాంటి నిది ద్వారా మన సమాజంలో ఎంతో మందికి సేవలు అందిస్తున్నామన్నారు.పేద ఆడపిల్లలకు స్కూల్,కాలేజీ ఫీజులకు సహాయము,ఆసుపత్రిలో వున్న పేద రోగుల ఖర్చులకు సహాయం  అందచేయడం జరుగుతుందన్నారు. అనాధ ఆశ్రమాలకు,వృద్ధ ఆశ్రమాలకు నెలసరి సరుకులు కూడా అందచేస్తామని తెలిపారు.పింక్ సర్కిల్ సంస్థ వారు గత నెల రోజుల నుండి పేద ఆడపిల్లలకు సహాయము కొరకు నిధులు సమకూరుస్తున్నారు.ఒక కుటుంబంలో ఆర్థిక సమస్య వస్తే మొదట ఆడ పిల్లల చదువులు ఆపేస్తారు,అటువంటి పిల్లలకు నిరాటంకంగా చదువులు కొనసాగాలని నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.ఈనెల రోజులు సమకూర్చిన నిధులతో 18 మంది ఆడపిల్లలకు  స్కూల్, కాలేజీ ఫీజులుకు నాలుగు లక్షల పైగా అందించామని తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలలో 70 మంది ఆడపిల్లలకు తోడుగా మా సంస్థ నిలిచిందని తెలిపారు.ఇది కేవలం దాతల ఉదార స్వభావం వలనే సాధ్యం అని ఎక్జిక్యూటివ్ కమిటీ వారు చెప్పారు.అనంతరం పేద విద్యార్ధినులకు ఫీజుల కొరకు చెక్కులు అంద చేశారు.పింక్ సర్కిల్ సంస్థ లో అమిత కృషి చేసిన వారికి మొమెంటోలు అందచేశారు.

తాజావార్తలు