నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొండంత భరోసా :జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్.

దౌల్తాబాద్ ఆగష్టు 28,జనం సాక్షి.
పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం కొనసాగుతుండగా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యం చేయించుకున్న వారికి సైతం సీఎం సహాయనిధి ద్వారా ఆదుకోవడంజరుగుతుందన్నారు.ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన వేమమంజుల13000రూపాయలు,బండల తరుణ్ 42000 రూపాయలు, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు.సిఎంఆర్ఎఫ్ పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుందని ముఖ్యమంత్రి గారికి ఎల్లపుడు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెట్ల నర్సంపల్లి గ్రామ సర్పంచ్ వేమ జనార్ధన్,టిఆర్ఎస్వి దుబ్బాక నియోజకవర్గం జనరల్ సెక్రెటరీ వేమకృష్ణ,ఎంపీటీసీల పోరం అధ్యక్షులు బండారు దేవేందర్, నాయకులు సత్తయ్య,రమేష్, తదితరులు పాల్గొన్నారు.