నిర్దేశిత లక్ష్యంతో భగీరథ పనులు: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌15(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేసి ప్రజలకు నిర్దేశిత గడువులోగా తాగునీరు అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌ రావు పఅన్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్‌, పంపుల నిర్మాణాలు, పైపులైన్లు, ఇంటింటికీ కనెక్షన్‌ వంటి పనులను వేగవంతం చేసేందుకు ఎక్కువ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటికీ సరఫరా చేసే కాంపోనెంటులను త్వరగా సమకూర్చుకోవాలని తెలిపారు. నిర్దేశించిన గడువు నాటికి ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. జిల్లాలో పనులు ప్రారంభించని గ్రామాల జాబితాను ఇవ్వాలని తెలిపారు. గ్రామాల పర్యటనలో మిషన్‌ భగీరథ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందే, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ వరకు వచ్చిన బల్క్‌ వాటర్‌ను ఇంటింటికీ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంట్రాగ్రిడ్‌ పనులను, ఇతర పనులు త్వరగా చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు నీటి సరఫరాకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.