నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

డోర్నకల్ సెప్టెంబర్ 15 జనం సాక్షి
కాంగ్రెస్ నాయకులు రెడ్డబోయిన శంకర్,భాస్కర్ ల మాతృమూర్తి వెంకటమ్మ ఇటీవల మృతి చెందడం తో గురువారం కర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.నియోజకవర్గ కాంగ్రెస్ నేత రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించి వెంకటమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట బానోత్ రాము,ఖాసీం,పగిడిపాల వెంకటేశ్వర్లు,లక్ష్మీనారాయణ,వెం కటయ్య, తదితరులు ఉన్నారు.
Attachments area



