నిశ్చితార్థ శుభకార్యంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్.
తాండూరు ఆగస్టు 21 (జనం సాక్షి)యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సిద్దిరాల శ్రీనివాస్ సులోచన ముద్దుల తనయుడు శ్యాం ప్రసాద్ రాజేశ్వరిల నిశ్చితార్థ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ మరియు తాండూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావుతో కలిసి పాల్గొని ఆశీర్వదించారు.ఆదివారం సదాశివపేట్ లోని ఓ పంక్షన్ హాల్లో శ్యాంప్రసాద్ రాజేశ్వరిల నిశ్చితార్థ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల్ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ మండల్ జడ్పిటిసి గౌరీ మంజుల వెంకటేశం, పిఆర్ టియు రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి, సీనియర్ పాత్రికేయులు వార్త రవిశంకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్, నాయకులు భాను, లక్ష్మణాచారి, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.