సంచలన ఆరోపణలు చేసిన కుటుంబరావు
న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రాల ప్రణాళిక సంఘాల ఉపాధ్యాక్షులతో నీతి అయోగ్ సమావేశమైంది. నీతి ఆయోగ్ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరయ్యారు. కాగా.. ఈ సమావేశంలో ఏపీకి మొదటి ఛాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబరావు విూడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ వేస్ట్. నీతి ఆయోగ్ పీఎం జేబు సంస్థగా మారింది. నీతి ఆయోగ్ నివేదికలకు విలువ లేకుండా పోయింది. క్యాపిటల్ రీజియన్ కేవలం 2500 కోట్లు మాత్రమే ఇచ్చారు. నీతి ఆయోగ్ డిసెంబర్ 2015లో రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పింది. వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను కూడా వెనుక్కి తీసుకున్నారు. నీతి ఆయోగ్ కమిటీ కూడా ఇవ్వాలని చెప్పారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు నిధులు ఇవ్వలేదు. నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు కేంద్రంతో సంబంధాలు సరిగ్గా లేని సమయంలో నీతి ఆయోగ్ కలిపించుకుని న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తాం’ ఇలా పలు విషయాలపై సమావేశంలో నీతి ఆయోగ్‌లో మాట్లాడినట్లు కుటుంబరావు తెలిపారు.