నులిపురుగుల వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారని, ఇది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం
మెదక్, సెప్టెంబర్ 16, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్ నులిపురుగుల వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారని, ఇది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాబట్టి 1 నుండి 19 సంవత్సరాలలోపు ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక తెలంగాణ మైనారిటీ మహిళా గురుకుల పాఠశాలలో బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేసి వేసుకోవలసినదిగా సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులి పురుగు వల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుందని, పోషకాహార లోపం, రక్తహీనతలతో నీరసించి పోతారని, చదువుపై శ్రద్ధ చూపలేరని, ఏకాగ్రత లోపిస్తుందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని , ఈ దిశగా విద్యార్థులు అవగాహన పెంపొందించుకొని భోజనం చేసేముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, స్వచ్ఛమైన నీటిని తాగాలని సూచించారు. ఇట్టి వ్యాధి నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సారాల నుండి ప్రతి ఏటా ఆగస్టు, ఫిబ్రవరి మాసాలలో ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తున్నదని అన్నారు. జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలు, 1,062 పాఠశాల, 42 జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థులతో పాటు బడిబయట ఉన్న 1 నుండి 19 ఏళ్ల లోపు పిల్లలు2,21,000 మంది ఉన్నారని గుర్తించి, ఈ రోజు అందరికి మాత్రలు పంపిణి చేస్తున్నామని, తప్పకుండా వేసుకోవాలని సూచించారు. 1 నుండి 2 సంవత్సరాల వయసున్న పిల్లలైతే ఆల్బెండజోల్ సగం మాత్ర వేసుకోవాలని, 2 నుండి 3 సంవత్సరాల వయసున్న పిల్లలైతే మాత్రను పొడి చేసుకొని రెండు చెంచాలు మాత్రమే కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలని అన్నారు. అదే 3 నుండి 19 సంవత్సరాల వయసున్న వారు ఆల్బెండజోల్ ఒక టాబ్లెట్ ను పూర్తిగా వేసుకోవాలని తద్వార పిల్లలలో చురుకుదనం పెరుగుతుందని, ఎంతో హుషారుగా ఉంటారని అన్నారు. ఏదేని అనివార్య కారణాలవల్ల నేడు మాత్రలు తీసుకోలేని వారు తిరిగి ఈ నెల 22 న పంపిణి చేసేటప్పుడు మాత్రలు తీసుకొని వేసుకోవాలని, మాత్ర తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిమాణాలు (సైడ్ ఎఫెక్ట్) ఉండవని ప్రతిమ సింగ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ అధికారి జెంలా, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, డాక్టర్లు నవీన్, మణికంఠ తదితరులు పాల్గొన్న