*నూతనంగా ఎన్నికైన కోరుట్ల నియోజకవర్గ రైతు వేదిక కమిటీ (రెబల్)*
మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 09
(జనం సాక్షి)
నేడు కోరుట్ల నియోజకవర్గం రైతు వేదిక కమిటీనీ( రెబల్) ఎన్నుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణ ములో ఆయన నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమం లో అన్ని కులాలకు చెందిన రైతులు సమావేశమై ఎన్నికలు జరపగా కోరుట్ల నియోజకవర్గం రైతు వేదిక (రెబల్) అధ్యక్షునిగా వేంపేట గ్రామానికి చెందిన శ్రీ అల్లూరి లింగారెడ్డి గారిని అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా గోపిడి సుమన్ రామలచక్కపేట్, సార్ల అంజిరెడ్డి వెల్లుల్ల, గోపనవేణి నారాయణ మెట్పల్లి, ఎర్రబెని అంజయ్య ముదిరాజ్, అంబటి హనుమాన్లు మేడిపల్లి, బత్తుల ప్రసాద్ మాజీ సర్పంచ్ వెంకటరావుపేట్, బర్ల అంజయ్య లను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులుగా.. శ్రీ అల్లూరి గంగారెడ్డి వేంపేట్, నూతుల లక్ష్మారెడ్డి వెల్లుల్ల, కట్కం గంగారెడ్డి ముత్యంపేట్, కోల నర్సారెడ్డి ఆత్మకూర్, అల్లూరి నరేష్ రెడ్డి దామరాజు పల్లి, మునీశ్వర రావు నాగులపేట, జవిడి హనుమాన్లు కొండ్రావుపేట ఎన్నికయ్యారు. మరియు జాయింట్ సెక్రటరీగా భీమండి గంగారం రజక, నీలి చిట్టి రెడ్డి మున్నూరు కాపు, మంచాల జలపతి బెస్త, కోరే గణేష్ కురుమ, ఏల్లాల రాజిరెడ్డి, జయా విజయ్ యాదవ్ ఎన్నికయ్యారు. అనంతరం ఇట్టి రైతు వేదిక కమిటీ రెబల్ నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమిరెడ్డి రాములు గారికి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుండి కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గంలో నిజం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, పసుపు బోర్డు, రైతు మద్దతు ధరల కొరకు నిరంతరంగా పోరాటం చేస్తామని ప్రతినభూనారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల హనుమాన్లు యాదవ్, కౌన్సిలర్ యామరాజయ్య, సీనియర్ న్యాయవాది సురభి అశోక్, అందే గంగాధర్, ఎండి రైసోద్దిన్, కంతి హరి కుమార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.