నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరణ
వేమనపల్లి,ఆగస్టు 22,(జనంసాక్షి): వేమనపల్లి మండల తహసీల్దార్‌గా సదానందం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి ఆయన బదిలీపై వేమనపల్లికి వచ్చారు.గతంలో ఇక్కడ పనిచేసిన వేముల రాజ్ కుమార్ వరంగల్ జిల్లా నెక్కొండ కి బదిలీఅయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.అనంతరం రెవెన్యూ సిబ్బంది నూతన తహసీల్దార్ కు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంతోష్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.