నూతన మండలాలుగా ఆలూరు డొంకేశ్వర్

 

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై23:-
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నూతనంగా ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ఏర్పాటు అయ్యాయి.
ఈ మేరకు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్తగా రెండు మండలాలు ఏర్పాటు చేయడం పట్ల పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు.
ఇందుకు ఆయన ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆలూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.