నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

సమాంతరంగా ఇంగ్లీష్‌, తెలుగు విూడియాలను కొనసాగించాలి
విజయవాడకు చేరుకున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల బస్సుయాత్ర

విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి మూడు, నాలుగు, ఐదు తరగతులను వేరు చేసే పక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని బడికోసం బస్సు యాత్రలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు హెచ్చరించారు. పాఠశాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు చేపట్టిన బడి కోసం బస్సుయాత్ర గురువారం విజయవాడకు చేరుకుంది. ఎమ్మెల్సీలు ఒక పాఠశాలకు చేరుకోగానే అక్కడి చిన్నారులు బడి ఇక్కడే ఉండాలని కోరారన్నారు. పాఠశాల విద్యా కమిటీలు, పంచాయతీల తీర్మానాలు లేకుండా ప్రభుత్వం పాఠశాలల విలీనానికి సిద్ధమైందని ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ యాత్ర పలాస నుంచి పెనుగొండ వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతి స్కూల్‌కు వెళ్లి అక్కడి సమస్యలు తెలుసుకుంటున్నా మన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి చదువుకున్న స్కూల్‌కు వెళ్లామని, తాము ఎక్కడికి వెళ్లినాప్రభుత్వం నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా పాఠశాలల విలీనం వద్దని కోరుతున్నారని చెప్పారు. ఒక్కసారి ప్రభుత్వం బయటకొచ్చి చూస్తే ఎంతమంది పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు తమకు ఉందని, జీతం తీసుకునే ఉపధ్యాయులకు కూడా ఉందని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 3, 4, 5 తరగతులు విలీన పక్రియ ఆపాలని, పాఠశాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జిల్లాలో చేపట్టిన బస్సు యాత్ర మైలవరం నెంబర్‌ 4 స్కూల్‌ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా పిడిఫ్‌ ప్లోర్‌ లీడర్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల 3,4,5, విలీన పక్రియ నిలుపుదలచేయాలని పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్‌ విూడియాలు సమాంతరంగా నడపాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అంగన్వాడి
సెంటర్లను బలోపేతం చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా విలీన పక్రియ ప్రవేశపెట్టిందన్నారు. మినిమం టైమ్‌ స్కేల్‌ పొందే ఉద్యోగుల ద్వారా బోధన కొనసాగిస్తూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించకుండా ఉన్న ఉపాధ్యాయులపై పనిబారం మోపుతుందని, బోధన సమయంలో రకరకాల యాప్‌ల కోసం కేటాయించి పని ఒత్తిడి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విలీన పక్రియ ప్రజలకు ఆమోదియోగంగా లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రత్యక్షంగా విలీనం అవుతున్న పాఠశాల వద్దకు వెళ్లిన క్రమంలో అనేక వాస్తవాలు వెలుగు చూపుతున్నాయని తెలిపారు. సీనియర్‌ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తప్పు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు ఏమిటో కిందకి వెళ్లి పరిశీలించాలని సూచించారు. విలీన పక్రియ తక్షణమే నిలిపివేయాలని జీవో నెంబర్‌ 117 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మైలవరం గ్రామంలో నంబర్‌ 4 ప్రాథమిక పాఠశాల బార్సు హై స్కూల్లో విలీలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించాలని ప్రభుత్వం తక్షణమే విలీన పక్రియ ఆపాలని ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు వై.వెంకటేశ్వర్లు, షేక్‌ షాబ్జి, వై.శ్రీనివాసులురెడ్డి యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.మనోహర్‌, సుందర్‌రావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కే.ప్రసన్నకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి ఏ.అశోక్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు జి.రామన్న ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు జిల్లా కార్యదర్శి సి.హెచ్‌ వెంకటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.నాగేశ్వరరావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ యూటీఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి పి.సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.