నెన్నెలలో వజ్రోత్సవం- వనమహోత్సవం.

ఫోటో రైటప్: మొక్కలు నాటుతున్న ఎంపీపీ రమాదేవి.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం ఎంపీపీ సంతోషం రమాదేవి ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వజ్రోత్సవం- వనమహోత్సవం చేపట్టి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశ ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నందున అందులో భాగంగా వజ్రోత్సవం- వనమహోత్సవం చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం నందులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఇందూరి నరేష్ కు పూల మాలలు వేసి శాలువతో సత్కరించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, సింగిల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, ఎంపీడీఓ వరలక్ష్మీ, ఎంపీవో శ్రీనివాస్, ఏపీఓ నరేష్, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, నందులపల్లి సర్పంచ్ బోయిని మల్లేష్, పంచాయతీ కార్యదర్శి పద్మనాభం, టీఆరెస్ నాయకులు సింగతి రాం చందర్, సంతోషం ప్రతాప్ రెడ్డి, గురునాదం ప్రేమ్ సాగర్, అంగన్వాడీ కార్యకర్త సరళ, గ్రామస్థులు పాల్గొన్నారు.