నేటి జిల్లా బంద్కు అనుమతి లేదు
మహబూబాబాద్,జూలై17(జనం సాక్షి): బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం విపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టనున్న జిల్లా బంద్కు ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ ఎన్.కోటిరెడ్డి స్పష్టం చేశారు. శాంతి-భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇదిలావుంటే బయ్యారం ఉక్కు కోసం విపక్ష పార్టీలు జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
—————–