నేటి జ్ఞాన సంకల్ప సభను విజయవంతం చేయండి.
– బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్స రవీందర్ ముదిరాజ్
దుబ్బాక 30, జూలై ( జనం సాక్షి )
సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో నిర్వహించే జ్ఞాన సంకల్ప సభను విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్స రవీందర్ ముదిరాజ్ తెలిపారు. ఆయన దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్ననట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. ఈశ్వర్ పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు జింక సంజీవ్, కోశాధికారి ఎడ్ల శంకర్ లు పాల్గొన్నారు.



