నేటి నుంచి ఇంటర్‌నెట్ సేవలు కోల్పోనున్న కంప్యూటర్లు!
హైదరాబాద్:ఇంటర్‌నెట్ ట్రాఫిక్‌ను దారి మళ్లించే డీఎన్ ఎన్‌ఛేంజర్ మాల్‌వేర్ ప్రభావంతో సుమారు 3లక్షల కంప్యూటర్లు సోమవారం నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ప్రముఖ వెబ్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తెలిపింది ఇందులో మన దేశం నుంచి 20 వేలకు పైగా కంప్యూటర్లు ఉన్నాయి.ఇంటర్‌నెట్ ట్రాఫిక్ ఫేక్ వెబ్‌సైట్లకు దారి మళ్లించే ఈ వైరస్ బాదిత దేశాల్లో అమెరికా ఇటలీ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని డీఎన్‌ఎన్ ఛేంజర్ వర్కింగ్ గ్రూప్ తెలిపింది.ఈ వైరస్ ప్రభావిత సర్వర్లను జులై 9న పెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూసివేయనుంది.ఆపరేషన్ ఘోస్ట్ క్లిక్ పేరుతో గత సంవత్సరం ఎఫ్‌బీఐ వైరస్ ప్రభావిత సర్వర్ల స్థానంలో తాత్కాలిక సర్వర్లను ఏర్పాటు చేసింది.అయితే వీటి కాలపరిమితి ఈ నెల 9తో ముగియనుండడంతో ప్రమాదం తప్పదన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీఎన్‌డబ్ల్యూజీ డేటా ప్రకారం అమెరికాలో 69,500 ఇటలీలో 26,500 భారత్‌లో 21,300 కంప్యూటర్లకు ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది.అయితే భారత్‌లో 50వేల కంప్యూటర్లు డీఎన్‌ఎన్ ఛేంజర్ బారినపడ్డట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం అధికారి తెలిపారు.అయితే వీటిలో సగానికిపైగా కంపూటర్లలో మాల్‌వేర్ ఇంకా ఉన్నట్లు చెప్పారు.