నేటి ఫ్రీడం ఫర్ రన్ లో పాల్గొనండి.

నెన్నెల ఎస్సై రాజశేఖర్.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండల కేంద్రంలో నేడు చేపట్టే ఫ్రీడం ఫర్ రన్ కార్యక్రమంలో పాల్గొనాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తిని గుండెల్లో నింపుకొని జాతీయ జెండాను రెపరెపలాడిద్దాం, జాతీయ సమైక్యతను దశదిశలా చాటుదాం అన్నారు. డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం 6-30 గంటలకు నెన్నెల మండల కేంద్రంలో ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్రీడమ్ రన్ దేశభక్తిని చాటి చెప్పడానికి, దేశ సమైక్యతను దశదిశల వ్యాపింప చేయడానికి, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తించుకొనడానికి ఉద్దేశించబడినదని, ఇట్టి ఫ్రీడమ్ రన్ మతాలకు, పార్టీలకు అతీతంగా కేవలం గుండెల నిండా దేశ భక్తితో స్వాతంత్ర పోరాట మహోజ్వల ఘట్టాలను స్మరించుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేయబడినదన్నారు.
ఇట్టి కార్యక్రమంలో యువకులు, మహిళలు, విద్యార్థులు, క్రీడాకారులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు,అన్ని శాఖల అధికారులు, అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో మన దేశభక్తిని, మన సమైక్యతను దశదిశల చాటి చెప్పుద్దాం అన్నారు.
ఫ్రీడం రన్ వివరాలు :
తేదీ : 11-08-2022
సమయం ఉ. 06:30 గంటలు
ప్రారంభం అయ్యే స్థలం : నెన్నెల టీ జంక్షన్.
ముగింపు: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల.