నేటి బాలలే….. రేపటి పౌరులు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల మల్ రెడ్డిపల్లి చైర్మన్ నాగమ్మ.
తాండూరు అగస్టు 23(జనంసాక్షి) నేటి బాలలే….. రేపటి పౌరులని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్ నాగమ్మ.పేర్కొన్నారు.
సోమవారం తాండూరు పట్టణం మల్రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల మల్ రెడ్డిపల్లి చైర్మన్ నాగమ్మ , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేష్, జిహెచ్ఎం శివకుమార్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నాగమ్మ, మాట్లాడుతూ విద్యార్థులందరూ దేశం పట్ల దేశభక్తిని కలిగి ఉండాలని, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్ని స్వతంత్రం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలిపారు.15 రోజుల జాతీయ జెండా ముగింపు కార్యక్రమంలో జాతీయ జెండా గురించి పిల్లల్లోనూ ఆటపాటలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. దేశభక్తి గీతాలు చక్కగా పాడిన వారికి చైర్మన్ బహుమతులు అందజేశారు