నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వంగరలో నిర్మించిన మోడల్ పోలీసు స్టేషన్, గురుకుల పాఠశాలను సీఎం ప్రారంభిస్తారు. మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వంగరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.