నేడు తెలంగాణకు రాహుల్, ఖర్గే
` ధరణి స్థానంలో భూమాత పోర్టల్..
` కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని హావిూలు
` సబ్బండ వర్గాలను ఆకర్షించే విధంగా రూపకల్పన
` నేడు విడుదల చేయనున్న రాహుల్, ఖర్గే
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రాహుల్ ప్రచారం కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో మల్లికార్జున ఖర్గే బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. 11.. 12 గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి హైదరాబాద్‌లోనే ఖర్గే బస చేయనున్నారు.
ధరణి స్థానంలో భూమాత పోర్టల్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని హావిూలు
సబ్బండ వర్గాలను ఆకర్షించే విధంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది. ఏకకాలంలో రూ.2లక్షల పంట రుణమాఫీ, రూ.3లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు, వ్యవసాయానికి 24గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ అన్ని వర్గాలను, ప్రజసంఘాలు, కుల సంఘాలు, మత పెద్దలు, అనేక సామాజిక వర్గాలకు చెందిన నాయకులను, ఉద్యోగులు, నిరుద్యోగులను సంప్రదించి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిరచాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.
మేనిఫెస్టోలో చేర్చిన హావిూలు ఇవే:కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ. గ్రామ పంచాయతీలకు చెరువుల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు. అందుకోసం తగినన్ని నిధులు. మెగా డీఎస్సీ ప్రకటించి.. ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల. పారదర్శకంగా నియామక ప్రక్రియ.విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం. బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయింపు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం. మూతబడిన దాదాపు 6వేల పాఠశాలలను పునఃప్రారంభిస్తాం.కొత్తగా నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ వర్తింపు.ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యం అందిస్తాం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడతాం. భూహక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు. పేదలకు పంపిణీ చేసిన 25లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తాం. సర్పంచ్‌ల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు జమ. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండిరగ్ డీఏలు చెల్లిస్తాం.సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాం.కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో అమలు చేస్తాం.