నేడు త్రోబాల్ క్రీడాకారుల ఎంపిక
వరంగల్,ఫిబ్రవరి28(జనంసాక్షి): జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ త్రోబాల్ క్రీడాకారుల ఎంపికలు ఆదివారం జరుగనున్నాయి. హన్మకొండ నెహ్రూ స్టేడియంలో వీటిని నిర్వహిస్తున్నట్లు త్రోబాల్ సంఘం సభ్యులు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రంగారెడ్డిలో మార్చి 7 నుంచి నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు మాత్రమే ఎంపికలకు హాజరుకావాలని కోరారు. 1999 ఏప్రిల్ ఒకటి తర్వాత పుట్టిన వారు మాత్రమే ఎంపికలకు హాజరుకావల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాల కోసంఫోన్‌లో సంప్రదించాలన్నారు. ఇదిలావుంటే అఖిలభారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల సాప్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే కాకతీయ విశ్వవిద్యాలయం జట్టును కేయూ క్రీడా మండలి కార్యదర్శి ప్రకటించారు. ఈ పోటీలు మార్చి ఒకటినుంచి 5వతేదీ వరకు దిల్లీ విశ్వవిద్యాలయంలో జరుగుతాయని తెలిపారు. పోటీలకు ఎంపికైన క్రీడాకారుల వివరాలను ప్రకటించారు. బి.ప్రశాంత్, కే.సుమన్, సీహెచ్.వెంకటేశ్, ప్రణీత్‌కుమార్,ఎం.రాంబాబు, ఎం.రాజేష్, టి.అనిల్, బి.సాయికుమార్, పి.కార్తీక్, ఎస్.యాదగిరి, జి.సుమన్, సీహెచ్.ఆనంద్, ఎస్.మణిరాజ్‌సింగ్, డి.క్రాంతికుమార్, పి.దిలీప్‌కుమార్ ఎంపికైన వారిలో ఉన్నారు.