నేడు నగరంలో నీటి సరఫరా బంద్

హైదరాబాద్ : కృష్ణా మూడో దశ పనుల్లో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం నీటి సరఫరా అయ్యే ప్రాంతాలకు తిరిగి ఈ నెల 6వ తేదీ (సోమవారం)న నీటిని సరఫరా చేస్తామని.. ఆదివారం సరఫరా అయ్యే ప్రాంతాల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. రెండు రోజులు నీటి సరఫరా నిలిచిపోతుండటంతో నగరవాసులు జాగ్రత్తతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.