నేడు నోటిఫికేషన్‌ విడుదల

` మరింత వేడెక్కనున్న రాజకీయాలు
` నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ
` 13న నామినేషన్ల పరిశీలన..15 వరకు ఉపసంభరణ
` 30న పోలింగ్‌..3న కౌటింగ్‌..అదేరోజు ఫలితాల ప్రకటన
` నామినేషన్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం నోటిఫేషన్‌  విడుదలతో వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానున్నది. అభ్యర్థులు నామినేషన్‌ లు వేసేందుకు మూడో తేదీ నుండి 10 తారీకు వరకు అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్‌  నవంబర్‌ 3న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ  నవంబర్‌ 10 కాగా, నామినేషన్ల పరిశీలన ` నవంబర్‌ 13న జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ నవంబర్‌ 15 కాగా,నామినేషన్‌ కేంద్రాలకు 100 విూటర్ల వరకు 144 సెక్షన్‌ విధించారు. కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్‌ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది.  నవంబర్‌ 30న పోలింగ్‌ నిర్వహించి డిసెంబర్‌ 3న ట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల ప్రక్రియకు ముందే ఎగ్జిట్‌ పోల్‌లను కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. అన్ని నియోజకవర్గాల్లో  యంత్రాంగం నామినేషన్‌ పక్రియకు జిల్లా వ్యాప్తంగా నామినేషన్‌ సెంటర్లను సిద్ధం చేసింది. రెవెన్యూ, పోలీస్‌ శాఖ సమన్వయంతో పటిష్ఠమైన భద్రతతో నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్‌ పత్రాలు విధి విధానాలపై రాజకీయ నాయకులకు ,పార్టీ ప్రతినిధులు ముందస్తుగానే అవగాహన కార్యక్రమాలు కల్పించారు. అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్రాల్లో అధికారులు సహాయక సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల  కార్యాలయాలను సిద్ధంచేసింది. ఆయా కార్యాలయాల్లో 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5వ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తే వారికి స్లిప్‌లు ఇచ్చి అందరూ నామినేషన్లు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నాయని సమాచారం. ఈ మూడు రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. నామినేషన్‌ రోజు నుంచి ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.10 వేల డిపాజిట్‌గా నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. అయితే ఆయనను బలపరిచే వారు మాత్రం స్థానిక నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలని ఎన్నికల సంఘం వెల్లడిరచింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ సారి ఈ నామినేషన్లలో మార్పులు చేసింది. అఫిడవిట్‌ ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్‌వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్‌ను తిరస్కరించే అధికారం ఆర్‌వోకు ఉన్నది. నామినేషన్‌ దాఖలు చేయడానికి జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావత్తు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఓట్లు తెచ్చుకుంటే డిపాజిట్‌ తిరిగి ఇస్తారు. అన్ని రాజకీయ పార్టీలు వరుసగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. కొన్ని సీట్లలో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థుల ఎంపికను ఫైనల్‌ చేసి.. బీఫాంలు ఇవ్వాలని నిర్ణయించాయి. సమయం ఎక్కువగా లేకపోవటంతోపాటు ప్రచారంపై దృష్టి పెట్టటానికి రెడీ అవుతున్నాయి పార్టీలు. టికెట్‌ రాని అభ్యర్థుల బుజ్జగింపులతోపాటు పొత్తుల్లోని పార్టీలతో చర్చలను.. వీలైనంత త్వరగా ముగించాలని నిర్ణయించాయి.. ఈ క్రమంలోనే నామినేషన్ల గడువు అయిన నవంబర్‌ 3వ తేదీని దృష్టిలో పెట్టుకుని..  అన్ని పార్టీలు పెండిరగ్‌.. అభ్యర్థులను ప్రకటించే పనిలో కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి తన మూడో జాబితాను విడుదల చేసింది.