నేడు భద్రాద్రి రాముడికి అభిషేక మహోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిపై కొలువై ఉన్న శ్రీరాములవారికి ఇవాళ అభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ స్వామివారికి అభిషేకం చేయనున్నారు.
సాయంత్రం యాగశాలలో ఉత్సవంగ హవనం చేయనున్నారు. రాత్రి ఏడు గంటలు నుంచి పది గంటల వరకు ఎదురుకోళ్ల ఉత్సవం, గరుడ సేవ జరుగనుంది.