నేడు భారత్‌ బంద్‌` మద్ధతు ప్రకటించిన పలురాజకీయ పార్టీలు

 

న్యూఢల్లీి,సెప్టెంబరు 26(జనంసాక్షి): కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు సూచించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ నిరసనను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ బంద్‌ నిర్వహిస్తున్నట్టు వెల్లడిరచింది. అన్ని రంగాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.కాగా కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న భారత్‌ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్ధతు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతుల డిమాండ్లను పష్కరించకుండా వారి పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేయడం మంచిది కాదంటున్నారు. ఈ బంద్‌లో అందరరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.