నేడు మెరుగైన వైద్యం పిటిషన్‌పై విచారణ
అదిలాబాద్, జనవరి 16 : అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అతని తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై బుధవారం నిర్మల్ మున్సిఫ్ కోర్టులో విచారణకు రానున్నది. ఈ పిటిషన్‌పై 12వ తేదీన జరగాల్సిన విచారణను న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని ఆయన తరఫు న్యాయవాదులు అక్బర్ హుస్సేన్, బాల్‌రాజ్, ఓవైసీ ఆసుపత్రి వైద్యులు నసీరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో అక్బరుద్దీన్ వాంతులు చేసుకోవడంతో పాటు తరచుగా అస్వస్థతకు గురవుతున్నందున హైదరాబాద్‌కు తరలించాలని వారు కోరారు. కాగా అక్బరుద్దీన్ అరెస్టు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని మజ్లిస్ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్ ఆరోపించారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినందున తమ పార్టీపై కక్ష కట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. అక్బరుద్దీన్ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని ఆయన డిమాండు చేశారు.