నేడు రెండోరోజు కాంగ్రెస్ మేధోమథన సదస్సు
జైపూర్: 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న జైపూర్ మేధోమథన సదస్సు నేడు రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన సదస్సు ప్రధానంగా ఐదు అంశాలపై చేపట్టిన చర్చ నేడు కూడా జరగనుంది. ఈ చర్చల్లో మన రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు కూడా పాల్గొననున్నారు.