నేడు వరంగల్ లో పర్యటించనున్న వెంకయ్యనాయుడు
వరంగల్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వరంగల్ పట్టణంలో పర్యటిస్తున్నారు. హృదయ్ పథకంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా 12 నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు ఒకటి. వరంగల్ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నేడు హృదయ్ పథకం పైలాన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అదేవిధంగా ఖిల్లా వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడిని వెంకయ్యనాయుడు సందర్శించనున్నారు.