నేడు వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ చేపట్టిన ఎమ్మార్పీఎస్
నేడు , హైదరాబాద్: వయో వృద్ధులు, వితంతువుల కోసం మానవీయ కోణంలో మహా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ బస్టాండ్ వెనక ప్రాంగణంలో ‘వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ’ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది హాజరయ్యే ఈ సభతో.. జనాభాలో కోటి మంది ఉన్న వృద్ధులు, వితంతువుల సమస్యల్ని కూడా రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండాగా చేయడమే లక్ష్యమని ప్రకటించారు. శనివారం ఉదయం ఉప్పల్ యుద్ధభేరి సభ ప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్‌లతో కలిసి మందకృష్ణ విలేకరుతో మాట్లాడారు. సభకు హాజరయ్యే వృద్ధులు, వితంతువులు అన్ని జాగ్రత్తలు తీసుకొని తరలిరావాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, వితంతువుల సమస్యలే ఎజెండాగా సాగుతున్న ఉద్యమం ప్రపంచానికే ఆదర్శంగా , స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.