నేడు సిక్కోలు పర్యటించనున్న సీఎం కిరణ్
హైదరాబాద్, జనంసాక్షి: అమ్మహస్తం ఇందిరమ్మ కలల కార్యక్రమాల్లో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.