నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై : దేశీయ స్టాక్ సూచీలు నేడు సెలవును పాటిస్తున్నాయి. దివాళి బలిప్రతిపాద నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్లు సోమవారం ట్రేడింగ్ను జరుపడం లేదు. కాగ, దివాళి రోజు జరిపిన గంట ముహురత్ ట్రేడింగ్లో మార్కెట్లు నిరాశపరిచాయి. నిఫ్టీ 12.30 పాయింట్ల నష్టంతో 8625.70గా, సెన్సెక్స్ 11.30 పాయింట్ల నష్టంతో 27,930వద్ద ముగిశాయి.