నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర విమోచన సంబరాలు
నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర విమోచన సంబరాలు సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సిటీ కళాశాల(A) లో జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. కార్యక్రమంలో నగర కార్యదర్శి నితిన్,SFS కన్వీనర్ దిలీప్ ప్రజాపతి, *గ్రేటర్ హైదరాబాద్ వనవాసి కన్వీనర్ సభావట్.కళ్యాణ్ గారు*
*మాట్లాడుతూ దశాబ్దాల స్వాతంత్ర ఉద్యమ ఫలితం బ్రిటిష్ పాలన అంతమై 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది, దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న వేళా
హైదరాబాద్ సంస్థాన్ ప్రజలు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది తెలంగాణ ప్రజల వీరత్వం హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తో 1948 సెప్టెంబర్ 17 న నిజాం నిరంకుశ పాలన అంతమై తెలంగాణ ప్రజలకు విమోచన కలిగి స్వతంత్రం సిద్ధించింది అన్నారు*తెలంగాణ లో నిజాం నిరంకుశ పాలన లో రజాకార్ల అకృత్యాలను విద్యార్థులకు వివరించారు*
*నిజాం నిరంకుశ పాలన,రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధుల యొక్క చారిత్రక గాధలను వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వీరుల త్యాగాలను ఈ తరానికి తెలియజేసే విధంగా ముందుకు పోవాలని ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతానని పలికిన కెసిఆర్ తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల తర్వాత నేడు కెసిఆర్ ప్రజలకు తలొగ్గి సెప్టెంబరు 17 ను అధికారికంగా నిర్వహిస్తున్న సమైక్యత పేరుతో ఉత్సవాలు నిర్వహించడం దీనికి నిదర్శనం అన్నారు, విమోచన జెండా ఎత్తడమే కాదు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల అకృత్యాలు కూడా ప్రజలకు చెప్పాలని అన్నారు
*ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వాసు, సిటీ కార్యవర్గ సభ్యులు సజన్, సోషల్ మీడియా కన్వీనర్ గణేష్ , నగర కార్యవర్గ సభ్యులు రాహుల్ ,రమేష్ విద్యార్థి నాయకులు అనూష, వెంకటేష్, శివ, అరవింద్ జిత్తు, పర్దీప్ వంశీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.