నోటాకు మెజార్టీ వస్తే ఏం చేయాలి?

NOTA

అభ్యర్థులకు వచ్చిన ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. నోటాపై న్యాయవాది దొరైవాసు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.కిరుబాకరన్, జస్టిస్ ఎన్.వి.మురళీధరన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వివరణ సమర్పించారు. ఎన్నికల సంఘం సమాధానంపై సంతృప్తి చెందని న్యాయస్థానం ఈ అంశంపై స్పష్టత కావాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.