నౌకలపై దాడిచేస్తే ఖబర్దార్..
` ‘సముద్రపు దొంగలను వేటాడతాం
` వారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం
` కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ముంబయి: భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకల పై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు వెల్లడిరచారు. ఈ దాడులకు పాల్పడిన వారు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ ఇంఫాల్ ’ను ముంబయి వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈమేరకు మాట్లాడారు.గుజరాత్ తీరానికి సవిూపంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ‘ఐసీజీఎస్ విక్రమ్’ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ దాడి ఇరాన్ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ వెల్లడిరచింది. అయితే, అమెరికా ఆరోపణను ఇరాన్ ఖండిరచింది. అంతకుముందు ‘ఎంవీ సాయిబాబా’పైనా దాడి జరిగింది. ఈ పరిణామాల నడుమ భారత హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎంవీ కెమ్ ప్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి నిజమే: భారత నేవీ
దిల్లీ :గుజరాత్ తీరానికి సవిూపంలోని అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న ఓ వాణిజ్య నౌక డిసెంబర్23న డ్రోన్ దాడి కి గురై నడి సంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని భారత నౌకాదళం నిర్థారించింది. భారత తీర ప్రాంతానికి 400 కి.విూ దూరంలో ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై డ్రోన్ జరిగిందని పేర్కొంది. నౌకలోని సిబ్బంది మొత్తం క్షేమంగా ఉన్నారని తెలిపింది. డ్రోన్ దాడిలో నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నౌక పాక్షికంగా దెబ్బతినగా.. 20 మంది భారతీయులతోపాటు మొత్తం 21 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నేవీదళం వెంటనే ‘ఐసీజీఎస్ విక్రమ్’ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. సోమవారం ‘ఐసీజీఎస్ విక్రమ్’ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్ట్ ప్రాంతానికి చేరుకుంది. పోర్టుకు రాగానే భద్రతా దళాలు నౌకను క్షుణ్ణంగా పరిశీలించారు. దాడి జరిగిన చోటు, నౌక శకలాలను గుర్తించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫొరెన్సిక్ పరీక్షలకు , సాంకేతిక విశ్లేషణకు పంపిస్తామని నౌకాదళ అధికారులు తెలిపారు.ఈ దాడి ఇరాన్ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ వెల్లడిరచింది. అయితే, అమెరికా ఆరోపణను ఇరాన్ ఖండిరచింది. ‘’దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సాయంపై నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారు’’ అని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నాసిర్ కనానీ వెల్లడిరచారు
(నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్ ఇంఫాల్’
` నౌకాదళంలోకి స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక
` ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
ముంబయి(జనంసాక్షి): భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ ఇంఫాల్ ’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ‘ఐఎన్‌ఎస్ ఇంఫాల్’ నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరుగుతున్న వేళ.. మన దేశ రక్షణ సామర్థ్యానికి ఈ యుద్ధనౌక మరింత పదును పెట్టనుంది.’ఐఎన్‌ఎస్ ఇంఫాల్’ పొడవు 163 విూటర్లు, బరువు 7,400 టన్నులు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ‘ఇంఫాల్ యుద్ధం’లో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా నౌకకు పేరు ఈ పెట్టారు. ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరును ఓ యుద్ధనౌకకు పెట్టడం ఇదే తొలిసారి.భారత నౌకాదళానికి చెందిన ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ దేశీయంగా రూపొందించిన నాలుగు ‘విశాఖపట్నం’ క్లాస్ డెస్ట్రాయర్‌లలో ఇది మూడోది. ఈ యుద్ధనౌకను ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది.2017 మేలో ఈ యుద్ధనౌక నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2019 ఏప్రిల్‌లో జలప్రవేశం చేయించారు. 2023 ఏప్రిల్ 28 నుంచి పూర్తిస్థాయి ట్రయల్స్ నిర్వహించారు. ఆరు నెలల్లోనే అక్టోబరులో నౌకాదళానికి అప్పగించారు. నిర్మాణం, పరీక్షలను అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకున్న స్వదేశీ నౌక ఇదే కావడం విశేషం.ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు, నౌకా విధ్వంసక అస్త్రాలు, టోర్పిడోలను ఈ యుద్ధనౌకలో మోహరిస్తారు. బ్రహ్మోస్ క్షిపణులూ ఇందులో ఉంటాయి.