న్యూఇయర్ స్పెషల్… వన్‌ప్లస్ ఆఫర్..
న్యూఢిల్లీ,డిసెంబర్29(జనంసాక్షి):నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్‌ను నేటి నుంచి అందిస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్యే విడుదలైన వన్ ప్లస్ 6టీ ఫోన్‌పై వినియోగదారులకు వన్‌ప్లస్ ఆఫర్లను అందిస్తున్నది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై కూడా ఈ ఆఫర్‌ను ఇస్తారు. వన్ ప్లస్ 6టి ఫోన్‌ను 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2వేలు అదనంగా ఇస్తున్నారు. కాగా ఈ ఆఫర్ జనవరి 6వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్ తెలియజేసింది. వన్ ప్లస్ 6టి ఫోన్‌లో 6.41 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 10 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
మరో మొబైల్స్ కంపెనీ వోటో కంపెనీ వి11, వి12, వి3, వి5ఎక్స్ పేరిట నాలుగు నూతన స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వీటిల్లో ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లను వీటిల్లో కామన్‌గా అందిస్తున్నారు.వి11, వి12 స్మార్ట్‌ఫోన్లలో 5 ఇంచ్ డిస్‌ప్లే ఉంగా, వి11 ఫోన్‌లో 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వి12 ఫోన్‌లో వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. వోటో వి3 ఫోన్‌లో 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వోటో వి5ఎక్స్ ఫోన్‌లో 5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.నాలుగు ఫోన్లలోనూ 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. వోటో వి5ఎక్స్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. వోటో వి11, వి12, వి3, వి5ఎక్స్ ఫోన్ల ధరలు రూ.4,999 నుంచి రూ.6,999 మధ్య ఉన్నాయి. వీటిని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.