న్యూజెర్సీలో దుండగుడి కాల్పులు

గన్‌మెన్‌తో సహా ముగ్గుకి మృతి
న్యూజెర్సీ,ఆగస్టు 31 (జనంసాక్షి): రోజుకో కాల్పుల సంఘటనతో అమెరికా వణికిపోతోంది. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో ఆగంతకు డు కాల్పులు జరిపారు. న్యూజెర్సీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పలు కాల్పుల సంఘటనల్లో ఓ గన్‌మన్‌ సహా ముగ్గురు మృతి చెందనిట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు, సాయుధులు మధ్య కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కాల్పుల్లో సాయుధ దుండగుడు హతమాయ్యాడు. ఉద్యోగులు పనిచేస్తుండగా సాయుధుడా పథక్‌మార్క్‌ షాపింగ్‌ సెంటర్‌లో కాల్పులకు దిగనట్లు సమాచారం. సాయుధుడు రక్షణ కవచం ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే భద్రతా బలగాలు షాపింగ్‌ సెంటర్‌ను చుట్టముట్టారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల కాలంలో అమెరికాలో ఇటువంటి సంఘటనల్లో ఇది నాలుగవది. ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ వద్ద వారం రోజుల క్రితమే ఇటువంటి సంఘటన జరిగింది. ఆగస్టు 5వ తేదీన మైఖేల్‌ వాడే పేజ్‌ విస్కాన్సిన్‌లో గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాజా సంఘటనతో అమెరికాలోని గన్‌ చట్టాలపై చర్చ ప్రారంభమైంది. గన్‌ చట్టాల గురించి మాట్లాడకపోవడంపై గురుద్వారా కాల్పుల తర్వాత న్యూయార్క్‌ మేయర్‌ మైఖేల్‌ బ్లూమ్‌బెర్క్‌ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ అధ్యక్ష నామినీ మిట్‌ రోమ్నీపై విమర్శలు గుప్పించారు. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో ఆయుధాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు.