పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న అధికారులు

తండాల్లో పంచాయితీ ఎన్నికల కళ
మహబూబాబాద్‌,మే28(జ‌నం సాక్షి): వచ్చే జూలైలో పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకుకేఇనేత్‌ కూడా ఆమోదించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఓటర్ల సవరణ, బిసి గణన పూర్తి కావస్తోంది.  త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్య అధికారులను ఇప్పటికే ఆదేశించారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశారు. కొత్తగా తండాలు కూడా పంచియితీలు కావడంతో అక్కడా ఎన్నికలు జరుగున్నాయి. దీంతో పంచాయతీ, పోలీస్‌ శాఖ వారితో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సవిూక్షించి, దిశానిర్దేశం చేశారు.  జిల్లాలోని 16 మండలాల్లో 461 గ్రామ పంచాయతీల్లో 4030 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మూడో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొదటి విడతలో మహబూబాబాద్‌ డివిజన్‌లోని 159 గ్రామ పంచాయతీల్లో 1378 వార్డులకుగాను 1378 పోలింగ్‌ స్టేషన్లు, 3290 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో మహబూబాబాద్‌, కురవి, డోర్నకల్‌, కేసముద్రం మండలాలకు, రెండో విడతలో తొర్రూరు డివిజన్‌లోని తొర్రూరు, పెద్దవంగర, నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాల్లోని 178 జీపీలు, 1570 వార్డుల్లో 1750 పోలింగ్‌ స్టేషన్లు, 3835 మంది పోలింగ్‌ స్టాఫ్‌ను నియమించనున్నట్లు చెప్పారు. మూడో విడతలో మహబూబాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలంలోని 124 గ్రామ పంచాయతీల్లోని 1082 పోలింగ్‌ కేంద్రాలకు 2578 మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. మహబూబాబాద్‌ డివిజన్‌లో 1562 పీవోలను, 31 ఏపీవోలు, 662 మంది ఇతరులతో కలిపి మొత్తం 2255 మందిని నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా తొర్రూరు రెవెన్యూ డివిజన్‌లో 440 పీవోలు, 11 ఏపీవోలు, 203 మంది ఇతర సిబ్బంది మొత్తం 654 మందిని నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అందుకు గాను ముందుగానే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.