పంటలకి నీరు ఇస్తారా ఇవ్వరా రైతులకు సమాధానం చెప్పండి

కడం జూలై 30( జనం సాక్షి )ప్రాజెక్టు ని నమ్ముకొని పంటలు వేసుకుంటున్న రైతులకి నీరు ఈ సీజన్ లో అందుతుందా లేదా ఎదో ఒకటి సమాధానం అధికారికంగా రైతులకి చెప్పాలని నియోజకవర్గ కాంగ్రెస్ నేత పొద్దుటూరి సతీష్ రెడ్డి డిమాండ్ చేసారు. వారు మాట్లాడుతు ఇటీవల భారీ వరద కారణం గా ప్రాజెక్టు గేట్లు కిందికి దిగకపోవడం తో లక్షల క్యూసేక్కుల వరద నీరు వృధా గా గోదావరి లో కలుస్తుంది కావున. రైతులు మాత్రం నీరు వస్తుoదని భరోసా తో పంటలు వేసుకుంటున్నరు వారికి సరైన సమయం కి నీరు దొరకడం తో పంటలు పండక నష్టపోతారు కావున. రైతులకి ఇప్పడే ఎదో ఒక సమాధానం వెంటనే చెప్పాలని డిమాండ్ చేసారు