పంట నమోదు కార్యక్రమం పకడ్బందీగా చేయాలి-. సింగారెడ్డిి

కూసుమంచి ఆగస్టు 17 ( జనం సాక్షి ) : ఈ సంవత్సరం వర్షాకాలంలో ఆగస్టు 30 వరకు వేసిన అన్ని పంటల నమోదు కార్యక్రమం పకడ్బందీగా జరగాలని ఖమ్మం, భద్రాద్రిికొత్తగూడెం  జిల్లాల వ్యవసాయ కమిషనరేట్ నుండి వచ్చిన ప్రత్యేక అధికారి బైరెడ్డి సింగారెడ్డి వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు భగత్వీడు, జుజ్జులరావుపేట, మల్లేపల్లి గ్రామాలలో వ్యవసాయ సిబ్బందితోపాటుగా సింగారెడ్డి క్షేత్ర సందర్శన చేసి నమోదు చేస్తున్న పద్ధతిని గమనించారు అలాగే రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి సాగు చేస్తున్న పంటలపై వారికి ఉన్న అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూసుమంచి రైతు వేదికలో నాలుగు మండలాలకు సంబంధించిన ఏవోలు, ఏ ఈ ఓ ల తో మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పంట నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కాబట్టి మీరందరూ  పంట నమోదు  ప్రభుత్వ ఆదేశానుసారం చేయాలని . తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఏవోలకు, ఏఈఓ లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ వ్యవసాయ అధికారి విజయచంద్ర, నాలుగు మండలాల ఏవోలు, నాలుగు మండలాల ఏఈవోలు పాల్గొన్నారు.