పండగలు.,..వాటి సాప్రదాయలను గుర్తు చేస్తున్న శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు.
మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమాళ్.
తాండూరు అగస్టు 11(జనంసాక్షి) నేటి సమాజంలో పండుగల చాలా మంది కి అవగాహన లేక వాటి సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో శ్రీ కృష్ణ వేణి
పాఠశాల యాజమాన్యం పండగలు.,..వాటి సాప్రదాయలను గుర్తు చేస్తున్న యాజమాన్యానికి మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమాళ్ అబినందించారు. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమాళ్ గుప్తకు విద్యార్థినిలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్పర్స్
స్వప్న మాట్లాడుతూ శ్రీ కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో రాఖి పండుగ సంబరాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకూడదని సూచించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.