పండగల వేళ ఎలక్టాన్రికి పరికరాలపై ధరల మోత

కనీసం 8శాతం పెరిగే ఛాన్స్‌ ఉందన్న నిపుణులు
న్యూఢల్లీి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : పండగల సీజన్‌ వేళ ఎలక్టాన్రిక్‌ వస్తువలపై ధరలు పెంచారు.
పండగ సీజన్‌లో ఏది కొనాలన్నా ఈసారి జేబుకు చిల్లు పడేలా ఉంది. కార్లు, బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫ్రిజ్‌, ఏసీ సహా పలు వస్తువుల ధరలు ఏకంగా 8 శాతం వరకూ ఎగబాకనున్నాయి. ముడిపదార్దాలు, సరుకు రవాణా వ్యయం పెరగడంతో ఈ ఏడాది మరోసారి ధరల పెంపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. పండగ సీజన్‌లో కన్జూమర్‌ ఎలక్టాన్రిక్‌ వస్తువుల ధరలు 8 శాతం వరకూ పెరగనుండగా, కార్లు, బైక్‌ల ధరలు రాబోయే వారాల్లో రెండు శాతం వరకూ భారం కానున్నాయి. పండగ సీజన్‌లో కార్లు, బైక్‌లు మోడల్‌ను బట్టి రూ 5,000 నుంచి రూ 10,000 వరకూ భారమవుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే కార్లు, ద్విచక్రవాహనాల ధరలు పలుమార్లు పెరగ్గా తాజా పెంపుతో పండగ సీజన్‌ అమ్మకాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్టీల్‌ ధరలు రెట్టింపు కావడం, అల్యూమినియం, రాగి ధరలు 25 శాతం వరకూ ఎగబాకడం, చిప్‌ ధరలు 25 నుంచి 75 శాతం వరకూ పెరగడంతో తయారీదారులకు ముడిపదార్దాల వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో కస్టమర్లపై కొంత భారం మోపక తప్పడం లేదని చెబుతున్నారు. ఇక స్మార్ట్‌ఫోన్‌ ధరలు న్యూ మోడల్స్‌ 3 నుంచి 5 శాతం పెరగనుండగా కొన్ని తాజా మోడళ్లు సైతం భారం కానున్నాయి. బాష్‌, హిటాచి వంటి అప్లయన్స్‌ బ్రాండ్లు 3 నుంచి 8 శాతం తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నాయి.