పండగ వాతావరణంలో చెక్కుల పంపిణీ

బ్యాంకుల వద్ద పతే్యక  ఏర్పాట్లు
జనగామ,మే15(జ‌నం సాక్షి ): వారం రోజులుగా జరుగుతున్న చెక్కుల పండగ జావుగా సాగుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా గ్రామాల్లో జోరుగా పండగ వాతావరకణం కొనసాగుతోంది. 10న ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారానికి ఆరోజుకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు డిప్యూటి సిఎం కడియం శ్రీహరి కూడా అక్కడక్కడా కార్యక్రమంలో పాల్గొన్నారు.  రైతును రాజుగా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం.. కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడి సాయాన్ని అందించే రైతుబంధు చెక్కులు, పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం రెండోరోజు శుక్రవారం జిల్లాలోని పలెపల్లెన పండుగ వాతావరణంలో కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా మండలానికి మూడు గ్రామాల చొప్పున జరిగిన కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎకరానికి రూ.4వేల చొప్పున ప్రభుత్వ సాయం పంపిణీ రైతు ఆనందోత్సాహాలు, ర్యాలీల నడుమ అట్టహాసంగా జరిగింది. చెక్కులు అందుతున్న రైతులు నేరుగా జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లోని సంబంధిత బ్యాంకులకు వచ్చి నగదు తీసుకునేందుకు ఉత్సాహంగా బ్యాంకుల వద్దకు వస్తున్నారు. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు పెద్దఎత్తున వస్తున్న
రైతులతో బ్యాంకుల ఎదుట సందడి నెలకొంది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రైతుల సౌకర్యం కోసం బ్యాంకుల ఎ దుట షామియాలను వేసి పోలీసు, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బం ది సాయంతో బారులుతీరిన వారిని క్యూపద్ధతిలో లోపలికి అనుమతించి నగదు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఎస్‌బీఐ బ్యాంకు, కెనరాబ్యాంకు ఎదుట చెక్కుల చెల్లింపు కోసం వచ్చిన రైతులు బారులు తీరి కనిపించారు. గ్రామాల్లో పండుగ వాతావరణం తలపిస్తుంటే..చెక్కులు విడిపించుకొని నగదు తీసుకునేందుకు వస్తున్న రైతులతో జిల్లా, మండల కేంద్రాల్లో సందడి నెలకొనగా బ్యాంకుశాఖలన్నీ కిటకిటలాడుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాధాపురంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ గాంధీనాయక్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ ఇర్రి రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌రావు పాల్గొన్నారు.  జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం గానుగపహాడ్‌, పసరుమడ్ల, పెంబర్తి, బచ్చన్నపేట మండలం కొడ్వటూరు, కేసిరెడ్డిపల్లి, గంగాపురం, నర్మెట మండలం మల్కాపేట, అక్కరాజుపల్లిలో జరిగిన పంట సాయం పంపిణీ కార్యక్రమాల్లో మండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బండ పద్మ పాల్గొన్నారు. అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని లింగాలఘనపురం మండలం జీడికల్‌, రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో రైతుబంధు చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరానికి రెండు విడతల్లో రూ.8వేలను పంపిణీ చేస్తుందన్నారు. రైతుల డబ్బులు వృథా చేయకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు, పంటల సాగు కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, రైతుబంధు చెక్కులు, సరికొత్త డిజైన్‌లో రూపొందించిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందుకని రైతులు మురిసిపోతున్నారు.
————————