పకడ్బందీగా ఎంసెట్‌ నిర్వహించాలి

కేయూక్యాంపస్‌ జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా మే10న జరగనున్న ఎంసెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరీశీలకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ ఎన్‌వీ. రమణరావు సూచించారు. రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ,చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరిశీలకుల సమావేశం కాకతీయ యూనివర్సిటీలోని సెసెట్‌హల్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా రమణారావుతో పాటు కో-కన్వీనర్‌ ప్రోఫెసర్‌ విశ్వనాధ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను అధికారులకు వివరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది ఇంజనీరింగ్‌, లక్ష మందికి పైగా మెడిసిన్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు రాయనున్నారు… 30రీజినల్‌ సెంటర్లు, వరంగల్‌ రీజినల్‌ సెంటర్‌లో 29 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రీజినల్‌ పరిధిలో ఇంజనీరింగ్‌ పరీక్ష 15 వేల మంది మెడికల్‌ పరీక్ష ఏడువేలమంది రాసే అవకాశముందని ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్ధులను అనుమతించొద్దని రిజిస్ట్రార్‌ ఎంవీ. రంగారావు ప్రొఫెసర్‌     భద్రునాయక్‌,ప్రోఫెసర్‌ పి.వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ రమ, ఇ,హరికృష్ణ పాల్గోన్నారు.