పక్కాగా చెక్కుల పంపిణీ ఏర్పాట్లు

అధికారులకు దిశానిర్దేవం చేసిన  కలెక్టర్‌
వరంగల్‌,మే5(జ‌నం సాక్షి ): రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్దేవించిన నిబందనలకు అనుగుణంగా కొనసాగించాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పేర్కొన్నారు. పాస్‌ పుస్తకాలు, చెక్కులను ఒకేదఫా పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లో ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎండాకాలం కావడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థంగా నిర్వహించాలని  సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ సూచించాచారు. ఈనెల 10వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. 119 గ్రామాల్లో 69,007 మంది లబ్దీదారులకు చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. రూ.69.38 కోట్లు లబ్దిదారులకు చెక్కుల రూపంలో అందిస్తామన్నారు. 10వ తేదీన ఖిలా వరంగల్‌, సీఎస్‌ఆర్‌, బిల్డింగ్‌ ఉర్సు, హసన్‌పర్తి, అనంతసాగర్‌, దేవన్నపేట, జయగిరి, లక్కవరం, కమలాపూర్‌, అంబాల, ఎల్కతుర్తి, కోతులనడుమ, హన్మకొండ బాసిత్‌నగర్‌, దేశాయిపేట, భీమదేవరపల్లి, కొవ్వూరు, కాజీపేట భట్టుపల్లి, యూపీఎస్‌ కొత్తపల్లి, ధర్మసాగర్‌ ధర్మాపూర్‌, సోమదేవరపల్లి, క్యాతన్‌పల్లి, వేలేరు, మల్లికుదుర్ల, ఐనవోలు, కనపర్తి, సింగారం తదితర ప్రాంతాల్లో 10వ తేదీన పంపిణీ కేంద్రాలు
ప్రారంభిస్తామన్నారు.