పట్టాలెక్కిన ‘వందే భారత్‌’!

– వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : సెవిూ హైస్పీడ్‌ వందే భారత్‌  ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ- వారణాసిల మధ్య గంటకు 160కిలోవిూటర్ల వేగంతో నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యానలు పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈరైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ బోగీలున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా రాకపోకలు సాగించే ఈ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చొనేలా సీట్లున్నాయి. 753 కిలోవిూటర్ల దూరం ప్రయాణం కేవలం 8గంటల్లో చేరుకునేలా రైలును ప్రవేశపెట్టారు. ఆటోమేటిక్‌ డోర్లు, జీపీఎస్‌ బేస్‌ డ్‌ ఆడియో విజువల్‌ ప్యాసింజర్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్‌, వైఫై ఎంటర్‌టైన్‌మెంట్‌ సౌకర్యాలున్నాయి. ఈ రైలుకు ఈ నెల 17వతేదీ నుంచి టికెట్‌ బుకింగ్‌ ప్రారంభిస్తామని రైల్వే అధికారులు చెప్పారు.