పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
భద్రాచలం: జగదభిరాముని కల్యాణమహోత్సవం భద్రాద్రిలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీసీతారాములకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టువస్త్రాలు , తలంబ్రాలను సమర్పించారు. ఆయన వెంట మంత్రులు సి.రామచంద్రయ్య , పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.