పట్నం ఫ్యామిలీకి పెద్ధేముల్ తెరాస నేతల అండ.

 

పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి. నాయకులు.
తాండూరు జులై 17(జనంసాక్షి)పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి మేమంతా అండగా ఉంటామని జిల్లా చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి.పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెకు భరోసా కల్పించారు. మర్పల్లి మండలంలో జడ్పీ చైర్పర్సన్ పై జరిగిన దాడి సంఘటన నేపథ్యంలో ఆదివారం పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు. యువ నేతలు సునీత మహేందర్ రెడ్డి నివాసంలో ఆమెను కలిసి చేయూతనిచ్చారు.సునీతా మహేందర్ రెడ్డి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని. ప్రతి కార్యకర్తకు పట్నం ఫ్యామిలీ అండగా ఉంటుందని. ఎవరు కూడా అధైర్య పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డివై. నర్సింలు. మాజీ సర్పంచులు కిషన్ రావు.ఎర్ర బాలప్ప. ఇందూర్ ప్రకాశం. మాజీ వార్డ్ సభ్యులు .విఠల్.హజీమ్. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి. అశోక్ గౌడ్. హజీ బాబా.నర్సింలు. వెంకటయ్య.రత్నప్ప. యువ నేతలు డివై. అరుణ్. నరేష్. చిన్న. కిరణ్. విష్ణు. మరియు విష్ణు అన్న యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.