పడి’లేచిన’ మార్కెట్లు
నష్టాల నుంచి గట్టెక్కిన దేశీయ మార్కెట్లు
ముంబై,నవంబర్13 (జనంసాక్షి) : స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 13) స్వల్ప లాభాల్లో ముగిశాయి. నేడు ఆద్యంతం మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సంవత్ 2076లో లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 43,443.00 వద్ద, నిప్టీ 29 పాయింట్లు ఎగిసి 12,720 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు లాభాల స్వీకరణ నేపథ్యంలో ఉదయం నష్టపోయిన మార్కెట్లు, ఆ తర్వాత తేరుకున్నాయి. తొలుత ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్ షేర్లు ఆ తర్వాత పుంజుకోవడం కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వివిధ దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ సాంకేతికంగా సంక్షోభంలోకి వెళ్లిందని
ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. మరోవైపు ఈ వారం ప్రారంభంలో రికార్డ్ స్థాయికి సూచీలు వెళ్లిన నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఈ కారణంగా కూడా మార్కెట్లు ఉదయం నష్టపోయాయి. ఓ సమయంలో 250 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 86 పాయింట్ల లాభంతో ముగిసింది. నేడు 43,508ని కూడా దాటింది. టాప్ గెయినర్స్ జాబితాలో… ఐచర్ మోటార్స్ 6.97 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.34 శాతం, కోల్ ఇండియా 3.11 శాతం, టాటా స్టీల్ 2.83 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.96 శాతం లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2000 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.2,035ను తాకిన షేర్ ధర ఈ రోజు చివరకు 1 శాతం లాభంతో ముగిసింది.
వరుసగా 8 రోజుల లాభాలకు నిన్న బ్రేక్ పడింది. మళ్లీ ఈ రోజు గాడిన పడ్డాయి. 10 సెషన్‌లలో 9 సెషన్లు లాభాల్లో ముగిశాయి. నిప్టడీ బ్యాంకు 187 పాయింట్లు ఎగిసి 28,466 వద్ద, మిడ్ క్యాప్ 171 పాయింట్లు లాభపడి 18,353 వద్ద ముగిసింది. ఐచర్ మోటార్స్ లాభాలు 40 శాతం తగ్గినప్పటికీ, అంచనాలకు మించి లాభాలు ఉన్నాయి. దీంతో ఈ స్టాక్స్ భారీగా పెరిగాయి. నిప్టీ ఆటో 0.30 శాతం, నిప్టీ బ్యాంకు 0.66 శాతం, నిప్టీ ఎనర్జీ 0.80 శాతం, నిప్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.26 శాతం, నిప్టీ ఐటీ 0.34 శాతం, నిప్టీ మెటల్ 1.67 శాతం, నిప్టీ ఫార్మా 1.08 శాతం, నిప్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.84 శాతం, నిప్టీ రియాల్టీ 1.34 శాతం, నిప్టీ ప్రయివేటు బ్యాంకు 0.75 శాతం లాభపడ్డాయి. నిప్టీ ఎఫ్‌ఎంసీజీ 0.06 శాతం, నిప్టీ విూడియా 0.94 శాతం నష్టాల్లో ముగిశాయి.